Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 52

Viswamitra accepts Sage Vasistha's hospitality !!

|| om tat sat ||

బాలకాండ
ఏబది రెండవ సర్గము

స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః |
ప్రణతో వినయాద్వీరో వసిష్ఠం జపతాం వరమ్ ||

స|| మహాబలః వీరః విశ్వామిత్రో స దృష్ట్వా పరమప్రీతో వినయాత్ జపతాం వరం వసిష్ఠం ప్రణతో ||

తా|| మహాబలవంతుడు వీరుడు అయిన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము చూచి పరమ సంతోషముతో వినయముగా జపము చేయుటలో శ్రేష్ఠుడైన వశిష్ఠునకు ప్రణమిల్లెను.

స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా |
ఆసనం చాప్య భగవాన్ వసిష్ఠో వ్యాదిదేశ హ ||

స|| మహాత్మనా వసిష్ఠేన స్వాగతం తవ చేత్ ఉక్తః | భగవన్ వసిష్ఠో ఆసనం చ అపి వ్యాదిదేశ హ ||

తా|| మాహత్ముడైన వశిష్ఠుడు " నీకు స్వాగతము" అని చెప్పెను. భగ్వత్సమానుడైన వసిష్ఠుడు విశ్వామిత్రునకు ఆసనమును సమర్పించెను.

ఉపవిష్ఠాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే |
యథా న్యాయం మునివరః ఫలమూలాన్యుపాహరత్ ||

స|| తదా మునివరః ధీమతే విశ్వామిత్రాయ ఉపవిష్ఠాయ యథా న్యాయం ఫలాన్యుపాహరత్ ||

తా|| అప్పుడు ఆ మునివరుడు ధీమతుడైన విశ్వామిత్రునిని కూర్చోబెట్టి యథావిధిగా ఫలములను ఇచ్చెను.

ప్రతిగుహ్య తు తాం పూజాంవసిష్ఠాత్ రాజసత్తమః |
తపోsగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత ||
విశ్వామిత్రో మహాతేజా వనస్పతి గణే తథా |
సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్||

స|| రాజసత్తమః వసిష్ఠాత్ తాం పూజాం ప్రతిగుహ్య తపః అగ్నిహోత్రః శిష్యేషు తథా వనస్పతి గణే కుశలం తథా పర్యపృచ్ఛత || వసిష్ఠః రాజసత్తమమ్ సర్వత్ర కుశలం చ ఆహ ||

తా|| ఆ రాజసత్తముడు వసిష్ఠుని పూజలను గ్రహించి తపస్సు అగ్నిహోత్రము, శిష్యుల కుశలములను గురించి అడిగెను. అదేవిథముగా వనస్పతి గణముల గురించి అడిగెను. వసిష్ఠుడు ఆరాజసత్తమునితో అందరూ కుశలమే అని చెప్పెను.

సుఖోపవిష్ఠం రాజానం విశ్వామిత్రం మహాతపాః |
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణస్సుతః ||

స|| జపతాం శ్రేష్ఠః మహాతపాః బ్రహ్మణస్సుతః వసిష్ఠో సుఖోపవిష్ఠం విశ్వామిత్రం రాజానం ప్రపచ్ఛ ||

తా|| తపోధనులలో శ్రేష్ఠుడు మహతపోనిథి బ్రహ్మసుతుడు అయిన వశిష్ఠుడు సుఖముగా ఉపవిష్ఠుడైన రాజు విశ్వామిత్రునితో ఇట్లడిగెను.

కచ్చిత్ తే కుశలం రాజన్ కచ్చిద్ధర్మేణ రంజయన్ |
ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక ||
కచ్చిత్ తే సంభృతా భృత్యాః కచ్చిత్ తిష్ఠంతి శాసనే |
కచ్చిత్ తే విజితాస్సర్వే రిపవో రిపుసూదన ||
కచ్చిత్ బలేషు కోశేషు మిత్రేషు చ పరంతపః |
కుశలం తే నరవ్యాఘ్ర పుత్త్రపౌత్రే తవానఘ ||

స|| రాజన్ ! తే కుశలం కచ్చిత్ | వీర ధార్మిక రాజవృత్తేన ధర్మేణ ప్రజాః పాలయసే రంజయన్ కచ్చిత్ ? తే భృత్యాః సంభృతా కచ్చిత్ | (తే) శాసనే తిష్ఠంతి కచ్చిత్ | రిపుసూదన ! తే సర్వే రిపవో విజితాః కచ్చిత్ |
హే పరంతపః బలేషు మిత్రేషు కోశేషు కచ్చిత్ | హే నరవ్యాఘ్ర అనఘా! తే పుత్త్ర పౌత్త్రే కుశలం |

తా|| "ఓ రాజా ! నీవు కుశలమే కదా . ఓ వీరుడా ధార్మికా రాజవృత్తితో ధర్మముగా ప్రజలను అనురంజకముగా పాలించు చున్నావా ? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా ? శాసనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రువులను జయించువాడా నీవు శత్రువులందరినీ జయించితివిగదా ? ఓ పరంతప బలములు , మిత్రులు , కోశములూ కుశలమా ? ఓ అనఘా ! నీ పుత్రులు పౌత్రులూ కుశలమా ?" అని

సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్ |
విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః ||

స|| విశ్వామిత్రో మహాతేజా వినయాన్వితః వసిష్ఠం సర్వత్ర కుశలం (ఇతి) ప్రత్యుదాహరత్ ||

తా|| మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు వినయముతో వసిష్ఠునకు అంతా కుశలమే అని ప్రతుత్తరమిచ్చెను.

కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తౌ కథాశ్శుభాః |
ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్||

స|| ముదా పరమయా తౌ ధర్మిష్ఠౌ సుచిరం కాలం పరస్పరం ప్రీయేతాం శుభాః కథాః యుక్తౌ ||

తా|| అట్లు అత్యంత సంతోషముతో ఆ ధర్మిష్ఠులిద్దరూ చాలాకాలము పరస్పర ప్రీతికరముగా శుభమైన కథా ప్రసంగములతో గడిపిరి.

తతో వసిష్ఠౌ భగవాన్ కథాంతే రఘునందన |
విశ్వామిత్రమిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివ ||

స|| హే రఘునందన తతః కథాంతే భగవాన్ వసిష్ఠః విశ్వామిత్రం ఇదం వాక్యం ప్రహసన్నివ ఉవాచ ||

తా|| ఓ రఘునందన ! అప్పుడు కథాప్రసంగముల తరువాత భగవన్ వసిష్ఠుడు దరహాసముతో విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

అతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల |
తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛమే ||
సత్ క్రియాంతు భవానేతాం ప్రతీచ్చతు మయోద్యతామ్|
రాజా త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||

స|| ( హే) మహాబల అస్య బలస్య తవ చ ఏవ యథార్హం సంప్రతీచ్చ మే అతిథ్యం కర్తు మిచ్చామి|| భవాన్ ఏతాం మయోద్యతాం సత్ క్రియాం తు ప్రతీచ్చతు | రాజా త్వం అతిథి శ్రేష్ఠః ప్రయత్నతః పూజనీయః ||

తా|| ఓ మహాబలా ! నీ బలగములకు మరియూ నీకు తగువిథముగా అతిథ్యమును ఇవ్వ దలిచితిని. మీరు నాచే ఇవ్వబడు ఆతిథ్యమును స్వీకరింపుడు. ఓ రాజా నీవు అతిథులలో శ్రేష్ఠుడవు మాకు పూజనీయుడవు.

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామునిః |
కృతమిత్యబ్రవీత్ రాజా ప్రియవాక్యేన మే త్వయా ||
ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే |
పాద్యే నాచమనాయేన భగవద్దర్శనేనచ |

స|| ఏవముక్తో మహామునిః వశిష్ఠేన రాజా విశ్వామిత్రః మే త్వయా ప్రియవాక్యేన ( ఆతిథ్యం) కృతం ఇతి అబ్రవీత్ | భగవన్ ! యత్ తవాశ్రమే విద్యతే ఫలమూలేన పాద్యేన ఆచమనాయేన భగవత్ దర్శనేన చ ||

తా|| ఈ విథముగా చెప్పిన మహాముని యగు వసిష్ఠునతో రాజా విశ్వామిత్రుడు " మీప్రియమైన వాక్యములతో ఆతిథ్యము చేయబడినది . భగవన్ ! మీ ఆశ్రమములో ఉన్న ఫలములతో, పాద్యములతో ఆచమనీయములతో , మీదర్శనముతో కూడా ( అతిథి సత్కారము జరిగినది)

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజర్హేణ సుపూజితః |
గమిష్యామి నమస్తే అస్తు మైత్రేణేక్షస్వ చక్షుసా ||

స|| మహాప్రాజ్ఞ సర్వథా పూజార్హేణ సుపూజితః | గమిష్యామి | నమస్తే అస్తు| మైతేణ చక్షుసా ఏక్షస్వ ||

తా|| ఓ మహాప్రాజ్ఞ ! అన్నివిథములుగా పూజింపతగిన వారిచే మేము పూజింపబడితిమి. వెళ్ళెదను. మీకు నమస్కారము. మమ్ములను మిత్రభావముతో చూడుడు"

ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవహి |
న్యమంత్రయత ధర్మాత్మా పునః పునారుదారధీః ||

స|| ఏవం బ్రువంతం రాజానం ధర్మాత్మా ఉదారధీః వశిష్ఠః పునరేవహి పునః పునః న్యమంత్రయత|

తా|| ఈ విథముగా చెప్పిన ఆ రాజుతో ధర్మాత్ముడు ఉదార స్వభావము కలవాడు అగు వసిష్ఠుడు మరల మరల అభ్యర్థించెను.

భాడమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ |
యథా ప్రియం భగవతః తథాస్తు మునిపుంగవ||

స|| గాధేయో వసిష్ఠం భాఢమిత్యేవ ప్రత్యువాచ హ | మునిపుంగవః భగవతః యథా ప్రియం తథాస్తు ||

తా|| ఆ గాధియొక్క పుత్రుడు వసిష్ఠునితో అంగీకరించుచూ ఇట్లు పలికెను. "ఓ భగవన్ మునిపుంగవ! మీకు ప్రియమగునట్లే చేయుడు" అని

ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః |
అజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూత కల్మషః ||

స|| ఏవం ఉక్తః మహాతేజో జపతాం వరః వసిష్ఠః తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః అజుహావ ||

తా|| ఈ విధముగా చెప్పబడిన తపోధనులలో శ్రేష్ఠుడైన కల్మషములేని వసిష్ఠుడు అప్పుడు , కామధేనువును పిలిచెను.

ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ |
సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోsస్మ్యహమ్||
భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్య్వమే|
యస్య యస్య యథా కామం షడ్రసేష్వభిపూజితమ్||
తత్సర్వం కామధుక్ క్షిప్రమ్ అభివర్షకృతే మమ |

స|| హే శబలే క్షిప్రం ఏహి ఏహి | మమ వచః శృణు చ అపి | రాజర్షేః అస్య బలస్య అహం కర్తుం వ్యవసితోశ్మి ||యస్య యస్య యథా కామం భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్య షడ్రసేష్వ అభిపూజితమ్ |

తా|| ఓ శబలా ! త్వరగా రా రా !. నా మాటలను వినుము. రాజర్షికి ఆయన బలములకు సత్కారము చేయవలెను. కామధేను ఎవరెవెరికి ఎట్లు కోరికగలదో ఏటువంటి అర్హతకలదో అట్టి షడ్రస రసముల భోజనముతో పూజింపవలెను.

రసాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్ ||
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర ||

స|| హే శబలే మమ అభివర్షకృతే తత్సర్వం కామధుక్ క్షిప్రం రసాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతం సర్వం అన్నానాం త్వర సృజస్వ||

తా|| ఓ శబలా ! త్వరగా రసాన్నములతో, పానీయములతో లేహ్యములతో కలిసిన అన్నములను త్వరగా సృజింపుము.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విపంచాశస్సర్గః ||
||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో ఎబది రెండవ సర్గ సమాప్తము||

||ఓమ్ తత్ సత్ ||